News

పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి


లోక్‌సభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో కవిత పసుపు పంట సాగుపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణది అగ్రస్థానం. సరైన మార్కెట్, మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పసుపు రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. పసుపు సాగు పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తెలంగాణలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.అదేవిధంగా ఏపీలోని గుంటూరులో ఉన్న పసుపు కేంద్రాన్ని వినియోగించుకునేలా తెలంగాణ రైతులకు అవకాశం ఇవ్వాలని అన్నారు.